18 August, 2026 | 2:20 AM

పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

18-08-2026 01:24 AM

మొయినాబాద్ ఆగస్టు 17(విజయ క్రాంతి): అజీజ్నగర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 198793 మధ్య చదువుకున్న 1993 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 33 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు నాటి మధుర జ్ఞాపకాలు, చిలిపి చేష్టలను నెమరువేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందన్నారు.

కష్టపడి చదివి జీవితంలో స్థిరపడటం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేందర్రెడ్డి, శివకుమార్, చంద్రశేఖర్రెడ్డి, శరభయ్య, శంకర్రెడ్డి, సుదర్శన్రావు, తాజుద్దీన్, ప్రదిమారెడ్డి, మధుసూదన్, ఉమామహేశ్వరి, సుమతి, రామకృష్ణారెడ్డితో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.