18 August, 2026 | 4:01 AM

పేదల సంక్షేమానికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలి

18-08-2026 02:17 AM

‘ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

నర్సాపూర్ (చిలిపిచేడ్)ఆగస్టు 17: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కొండంత అండగా నిలుస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం యథావిధిగా కొనసాగించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, అదే జరిగితే ప్రజాక్షేత్రంలో తీవ్ర ప్రతిఘటన, తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

సోమవారం మెదక్ జిల్లా చిలిపిచెడ్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నా, రాస్తారోకో కార్యక్రమంలో ఆమె పాల్గొని  మాట్లాడుతూ పేదలకు మానవీయ భరోసా: ఆడపిల్లల తల్లిదండ్రుల ఆర్థిక కష్టాలను కళ్లారా చూసిన నాటి సీఎం కేసీఆర్, మానవీయ కోణంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తెచ్చి లక్షలాది కుటుంబాలకు వెలుగునిచ్చారని కొనియాడారు.

అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వంకోర్టు నెపంతో జాప్యం చేస్తూ ఈ సంక్షేమ పథకాలపై హైకోర్టులో కేసు దాఖలైతే, ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు.రైతుల ఇబ్బందులు: సకాలంలో యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, యాప్ల పేరుతో రైతులను గందరగోళానికి గురిచేయకుండా ఎరువులను అందు బాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కొనసాగింపుపై స్పష్టత ఇవ్వాలని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో  బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అశోక్ రెడ్డి, ధర్మారెడ్డి, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.