14 July, 2026 | 11:19 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

మ్యాక్స్‌వెల్‌కు షాక్

02-04-2026 01:31 AM

సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఔట్

మెల్‌బోర్న్, ఏప్రిల్ 1: స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ షాక్ ఇచ్చింది. సెంట్రల్ కాంట్రాక్టు జాబితా నుంచి అతడిని తప్పించింది. 2026 సీజన్‌కు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. 21 మందితో కూడిన ఈ జాబితాలో మ్యాక్స్‌వెల్‌కు చోటు దక్కలేదు. 2025 జూన్‌లో మాక్స్‌వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

2017లో చివరి సారిగా ఆసీస్ తరుపున టెస్టు మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం కేవలం టీ20ల్లోనే కొనసాగుతున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లోనూ అతడు పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో అతని కెరీర్ ముగిసినట్టేనని భావిస్తున్నారు. రిటైరయిన ఉస్తామ్ ఖవాజాతో పాటు ఫామ్ కోల్పోయిన రిచర్డ్‌సన్ , మోరిస్, షార్ట్ వంటి ప్లేయర్స్‌కు చోటు దక్కలేదు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను చూస్తే టెస్టు స్పెషలిస్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.