Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్
ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం
ఇరాన్ ఓడరేవులను దిగ్భంధిస్తాం: ట్రంప్
Strait of Hormuz Crisis మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు ప్రకటించిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకలను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, బలప్రయోగానికి వెనుకాడబోమని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ చమురు రవాణా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముంది.
Strait of Hormuz Crisis అంటే ఏమిటి?
Strait of Hormuz Crisis అనేది ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిని కేంద్రంగా చేసుకుని అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితి. అమెరికా ఇరాన్ నౌకలపై ఆంక్షలు ప్రకటించగా, ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశముంది.
Strait of Hormuz Crisis ఎందుకు మళ్లీ ఉద్రిక్తంగా మారింది?
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్త(Tensions in West Asia) పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా, ఇరాన్ తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కత్తులు దూసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ కు నౌకలు వెళ్లకుండా, రాకుండా హర్మూజ్(Hormuz)లో అడ్డుకుంటామని ట్రంప్ తెలిపారు. ఇతర నౌకలు మాత్రం హర్మూజ్ ను స్వేచ్ఛగా వాడుకోవచ్చని సూచించారు. నౌకల్లోని సరుకు విలువలో 20 శాతం వరకు టోల్ వసూలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు.
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ హెచ్చరిక
ట్రంప్ ప్రకటనపై(Trump's announcement) ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హర్మూజ్ జలసంధి(Strait of Hormuz) విషయంలో అమెరికా జోక్యాన్ని సహించబోమని ఇరాన్ తేల్చిచెప్పింది. తమ నౌకలను అడ్డుకుంటే బలప్రయోగానికి దిగితామని ఇరాన్ హెచ్చరించింది. తమ అనుమతి తేలకుండా అమెరికా రక్షణతో వెళ్లే నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా సైన్యానికి సాయం చేయకూడదని గల్ఫ్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. అమెరికా వలే 20 శాతం కాకుండా తక్కువ రుసుం వసూలు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది.
ప్రపంచ చమురు ధరలపై ఈ సంక్షోభం ప్రభావం
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్లు ఆందోళనకు గురయ్యాయి. ప్రపంచంలో సముద్ర మార్గం ద్వారా రవాణా అయ్యే ముడి చమురులో గణనీయమైన భాగం హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు, రవాణా ఖర్చులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
RELATED ARTICLES.....
48 గంటల్లో తెరవకపోతే పేల్చివేస్తాం — ట్రంప్ అల్టిమేటంకు ఇరాన్ కౌంటర్!
వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
అమెరికా-ఇరాన్ యుద్ధం: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన, 10 డిమాండ్లు వెలుగులోకి
హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలి: ట్రంప్






