హెచ్‌సీఏలో రూ.600 కోట్ల అవినీతి
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపణలు
17 జీహెచ్‌ఎంసీ క్లబ్బులను అమ్మేశారు
టీ20 లీగ్ జట్ల అమ్మకంలో స్కామ్ : గురువారెడ్డి
సీఎం రేవంత్, డీజీపీలకు టీసీఏ ఫిర్యాదు
హైదరాబాద్, ఏప్రిల్ 1: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతికి పరాకాష్టగా మారిపోయిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపించింది. దాదాపు రూ.600 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని టీసీఏ సెక్రటరీ ధరం గురువారెడ్డి చెప్పారు. ప్రభుత్వ క్లబ్బులను ప్రైవేట్ వ్యక్తులకు రూ.2.5 కోట్ల రూపాయలకు అమ్మేశారని ఆరోపించారు. దాదాపు 17 జీహెచ్‌ఎంసీ క్లబ్బులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని గురువారెడ్డి చెప్పుకొచ్చారు.
103 అసలైన క్లబ్బులను మాయం చేసి, 80కి పైగా నకిలీ క్లబ్బులను చేర్చారని, తద్వారా ఓటర్ల జాబితాలో మో సానికి పాల్పడ్డారని టీసీఏ ఆరోపిస్తోంది. ఈ అంశాలపై గతంలోనే జస్టిస్ ఏఆర్ దవే కమి టీ, జస్టిస్ ఎన్‌ఏ కక్రు సూపర్‌వైజర్ కమిటీ, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు కమిటీలు నివేదికల్లో ప్రస్తావించాయని గుర్తు చేశారు. విశాఖ ఇండస్ట్రీస్‌కు ఇచ్చిన రూ.69 కోట్ల రూపాయలతో సహా చాలా అంశాల్లో అవినీతి జరిగిం దని వెల్లడించారు. ఇప్పుడు టీ20 లీగ్ పేరు తో అందులోని జట్లను బ్యాక్‌డోర్‌లో విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గురువారెడ్డి చెబుతున్నారు. ఐపీఎల్ టికెట్ల అమ్మకానికి సంబంధించి పెద్ద ఎత్తున బ్లాక్‌మార్కెట్ దందా కూడా నడుస్తోందని ఆరోపించారు.
నిధుల దుర్వినియో గం దగ్గర నుంచి నమ్మక ద్రోహం, మోసం, ఫోర్జరీ, తప్పుడు నమోదు పత్రా లు, క్రిమినల్ కుట్రలకు సంబంధించిన ఆరోపణలపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ శివధ ర్‌రెడ్డి, అదనపు డీజీపీ చారు సిన్హాలకు ఫిర్యా దు చేశారు. గత 20 ఏళ్లు గా క్రికెట్ అభివృద్ధి కో సం కేటాయించిన నిధులను దారి మళ్ళించి దుర్వినియోగం చేసారని, దీని వల్ల రూ. 600 కోట్ల దోపిడీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
విశాఖ ఇండ స్ట్రీస్‌కు ఆర్బిట్రేషన్ చెల్లింపు కూడా పెద్ద స్కామ్‌గా అభివర్ణించారు. హెచ్‌సీఏ ప్రతినిధులు, విశాఖ సం స్థతో కుమ్మక్కై వారికి పరోక్షంగా లబ్ది చేకూర్చారని ఆరోపించారు. ఈ మొత్తం అవినీతికి సంబంధించి సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే దోచుకున్న నిధుల రికవీరీ కోసం సంబంధిత బాధ్యుల ఆస్తులు అటాచ్ చేయాలని కోరారు. అలాగే అక్రమంగా బదిలీ అయిన జీహెచ్‌ఎంసీ క్లబ్బు లను తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేయాలని గురువారెడ్డి డిమాండ్ చేశారు.




