20-12-2025 12:00:00 AM
* కాంగ్రెస్లో చేరిన బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు, నాయకులు
మెదక్, డిసెంబర్ 19(విజయక్రాంతి): మెదక్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సర్పంచ్లతో పాటు, పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. మాజీ మంత్రి హరీష్రావు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి సన్నిహితుడుగా పేరొందిన బీఆర్‌ఎస్ నేత చింతల నర్సింలు శుక్రవారం మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అలాగే హవేలీ ఘన్పూర్ మండలం జక్కన్నపేట బీఆర్‌ఎస్ సర్పంచ్ చామంతుల సత్యనారాయణతో పాటు ఇదే మండలం పోచంరాల్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సర్పంచ్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇది కీలకమైన రాజకీయ పరిణామంగా భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్లో చేరిన వారంతా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు తెలిపారు.