20-12-2025 12:00:00 AM
కేసముద్రం, డిసెంబర్ 19 (విజయక్రాంతి): ఉపాధి హామీ చట్టాన్ని పథకం గా మార్చి ని ర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరుతో ఉన్న నరేగా పేరును వీ బీ జీ రామ్ జీ గా మార్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జీ.నాగయ్య ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని గాంధీ సెంటర్ లో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గోడిశాల వెంకన్న ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చ ట్టాన్ని రద్దుచేసి వీ.బీ.జీ.రామ్.జీ 2025 పథకంగా మార్చడానికి నిరసిస్తూ బిల్లు ప్రతులు దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చి నిర్వీర్యం చేసే కుట్రను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
నరేగాను యధావిధిగా చట్ట రూపంలోనే ఉంచి నిధులను పెంచాలనీ, పేరును మార్చొద్దని డి మాండ్ చేశారు. ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నరేగాను బలోపేతం చేయాలనీ, పనిదినాలను 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. నరేగా అనేది వామపక్ష పార్టీల పోరాటాలు, అప్పటి యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడితో వచ్చిందని గుర్తుచేశారు. వ్యవసాయ పనులు లేనప్పుడు, కరువుల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూలీలకు ఎంతో ఇతోధికంగా అండగా నిలిచిందనీ, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంలో కీలక పాత్రపోషించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మార్తినేని పాపారావు, నాయకులు చాగంటి కిషన్, నీరుటి జలంధర్, జల్లే జయరాజ్, మోడెం వెంకటేశ్వ ర్లు, ఏల్పుగొండ సావిత్ర, సోమరపు ఎల్లయ్య, గుగులోతు కేశ్యా నాయక్, శేఖర్, వెంకన్న, పుట్ట ముత్తయ్య, ముద్రకొల శ్రీను, సారయ్య, జ్యోతి, పొన్నాల జ్యోతి, నర్సమ్మ పాల్గొన్నారు.