calender_icon.png 20 December, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లెప్రసీపై ఇంటింటి సర్వే

20-12-2025 12:00:00 AM

వెంకటాపురం(నూగూరు), డిసెంబర్ 19(విజయక్రాంతి): ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరి ధిలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఇంటింటి స ర్వే ప్రారంభమైంది జాతీయ లెప్రసీ నిర్మూలన కా ర్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా క్టర్ గోపాల్ రావు,జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్ ఆదేశాలతో ఇంటింటి సర్వే ఈ నెల 18వ తారీకు నుండి 31వ తారీకు వరకు గ్రామాలలో సర్వే నిర్వహించడం జరుగుతున్నది.వ్యాధి లక్షణాలు,శారీరంపై పాలిపోయిన,ఎర్ర రంగు గలస్పర్శ లేని మచ్చలు, ముఖముపై రాసినట్లు మెరుస్తూ ఉండటం,గోధుమ రంగు లేని మచ్చలు ఉన్నట్లయితే కుష్టు వ్యాధి లక్షణాలు గుర్తించబడతాయని వైద్య సిబ్బంది వివరిస్తున్నారు.

అది వంశపారంపర్యం కాదని,చికిత్స చేయించుకుంటే అంగవైకల్యం రాకుండా నిరోధించవచ్చున్నా రు.సబ్ సెంటర్ పరిధిలోగల గ్రామాలలో ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం వారానికి రెండు రోజులు శుక్రవారం, మంగళవారం గ్రామాలలో గ్రామస్తులకు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి డ్రమ్ములపై మూతలు ఉంచాలని, నిలువ నీటిని వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో పారపోయడం జరిగింది. శీతాకాలపు వ్యాధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని, వైద్య సిబ్బంది తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలోపి హెచ్ ఎన్ ఏకమ్మ, హెచ్ ఓ కోటిరెడ్డి, ఏఎన్‌ఎం, హెల్త్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు.