30-06-2024 12:05:00 AM
మీరా నందన్.. స్వరాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ సినిమాలో నటించిన హీరోయిన్. ఆ సినిమాలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మీరా. ఆ సినిమా ప్రేక్షకాదరణ పొంది విజయం సాధించినప్పటికీ మీరా మాత్రం తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. ఆమె స్వస్థలం కొచ్చి. మలయాళ టీవీ వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించిన ఈ కేరళ కుట్టి మాతృభాషా చిత్రాల్లోనే ఎక్కువగా నటించింది. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె తాజాగా పెళ్లి చేసుకుంది. యూకేలో సీఏ (చార్టెడ్ అకౌంటెంట్)గా స్థిరపడిన శ్రీజు అనే వ్యక్తిని మీరా వివాహం చేసుకుంది. ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా ఈ జంట.. ప్రముఖ గురువాయుర్ దేవాలయంలో పెళ్లి తంతు ఏర్పాటు చేసుకొని, వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. మీరా నందన్ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫొటోలు చూసిన వాళ్లంతా కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.