6 April, 2026 | 4:49 PM

Breaking News

కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు   •   ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. వీఐపీ గేటులోంచి దూసుకొచ్చిన మాస్క్ మ్యాన్ కారు   •   ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •   సెస్ విలీనంతో పారదర్శక పాలన వినియోగదారులకు నాణ్యమైన సేవలు   •   ముఖ్యమంత్రిని సన్మానించిన ఖానాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు   •   ఉమామహేశ్వరంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు   •   ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్.. లిక్కర్ కేసు విచారణ వాయిదా   •   హిందూ సమ్మేళనానికి రూ 5100 విరాళం   •  

భారీ క్షీణత తర్వాత స్వల్ప పెరుగుదల

07-12-2024 12:00 AM

658 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు

ముంబై, డిసెంబర్ 6:  వరుస క్షీణతను చవిచూస్తున్న విదేశీ మారక నిల్వలు నవంబర్ 29తో ముగిసినవారంలో స్వల్పంగా పెరిగాయి.  శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం  నవంబర్ 29తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు 1.51 బిలియన్ డాలర్లు పెరిగి 658.091 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. సెప్టెంబర్ చివరినాటికి ఫారెక్స్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.

ఆ స్థాయి నుంచి వరుస 9 వారాల్లో  దాదాపు 48 బిలియన్ డాలర్లు క్షీణించాయి. తాజాగా నవంబర్ 29తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 2.061 బిలియన్ డాలర్లు పెరిగి 568.852 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

తగ్గిన బంగారం నిల్వలు

ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు సమీక్షావారంలో 595  మిలియన్ డాలర్లు తగ్గి 66.979 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 22 మిలియన్ డాలర్లు పెరిగి 18.007 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్లు రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు కూడా 22 మిలియన్ డాలర్లు పెరిగి 4.254బిలియన్ డాలర్ల వద్దకు చేరాయి.