29 August, 2026 | 10:26 PM

తూప్రాన్ మున్సిపల్ 9వ వార్డులో అక్రమ నిర్మాణాలపై‌ కలెక్టర్ కు ఫిర్యాదు

29-08-2026 09:52 PM

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డులో నిబంధనలు అతిక్రమించి సెట్ బ్యాక్ ఇవ్వకుండా రెడ్డి సంఘం నిర్మాణం చేస్తున్నారని వెంటనే నిర్మాణాన్ని నిలుపుదల చేసి కాలనీవాసులకు న్యాయం చేయాలని  కాంగ్రెస్ పార్టి రాష్ట్ర నాయకులు బొల్లేబోయిన మహేష్ యాదవ్ తో కలసి కాలనీ వాసులు మెదక్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ... తొమ్మిదవ వార్డులో జరుగుతున్న రెడ్డి సంఘం నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉందనే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ కు వ్రాతపూర్వకంగా కాలనీవాసులు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి స్పందించిన టీపీవో ప్రణూతి నిర్మిత స్థలాన్ని పరిశీలించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇదే అదనుగా భావించి నిర్వాహకులు సంఘం నిర్మాణం వేగవంతం చేశారని పేర్కొన్నారు. కాలనీ  కార్నర్ మద్యన భవనం నిర్మించడం వల్ల రోడ్డు ఇరుకుగా ఏర్పడి హేవి వేహికిల్ రావడానికి ఇబ్బందిగా మారి ప్రమాదలు జరిగే అవకాశలు ఉన్నాయి.

ఇప్పటికైన భవన నిర్మాణదారులు 30 పీట్ల రోడ్డు విడిచి సెట్ బ్యాక్ వదిలి నిర్మాణం చేపట్టాలని ఇలాంటి సామూహిక నిర్మాణం చేపట్టడం వల్ల స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి సెట్ బ్యాక్ ఇవ్వకుండా చేపట్టిన ఇట్టి నిర్మాణాన్ని నిపివేయాలని పేర్కొన్నారు. అదికారులు తక్షణమే అధికారులు స్పందించి చర్య తీసుకోవాలని స్థానికుల డిమాండ్. ఇందులో తూప్రాన్ మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డు స్థానికులు ఉన్నారు.