29 March, 2026 | 4:03 AM

నీటి సమస్యకు పరిష్కారం

29-03-2026 02:08 AM

కృషి చేసిన ఎమ్మెల్యేకు ఏసిఎఫ్ ప్రత్యేక ధన్యవాదాలు 

రాజేంద్రనగర్ మార్చి 28 (విజయ క్రాంతి) : భవాని నగర్ లో ఏర్పడిన నీటి సమస్యను పరిష్కరించాలని రెండు వారాల క్రితం, భవానీ నగర్ నీటి జలాశయంపై ఉన్న ట్యాంకర్ భారాన్ని తగ్గించాలని ఏ సి ఎఫ్ . హైదరాబాద్ మెట్రో వాటర్ అధికారులను కోరింది. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హెచ్‌ఎండబ్ల్యూఎస్ అధికారులు పి అండ్ టి కాలనీ నీటినీ నింపే పంప్ హౌస్ లో కార్యకలాపాలను చేపట్టింది .

దీంతోనీటిని నింపే రెండు కేంద్రాల మధ్య నీటి ట్యాంకర్ భారాన్ని సమర్థవంతంగా పంపిణీ చేస్తున్నారు, నీటి సరఫరా పై. ఏ సి ఎఫ్ తమ సత్వర చర్యలు, మద్దతుకు హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు గంధంగూడా ప్రాంతంలో నీటి సమస్యలను గరిష్ట స్థాయిలో తగ్గించగల శ్రీనివాస నగర్లోని 2 మిల్లీ లీటర్స్ నీటి జలాశయాన్ని త్వరగా ప్రారంభించాలని ఏసి ఎఫ్ వాటర్ బోర్డు అధికారులను కోరారు..

ఈ సందర్భంగా, సాయి బాలాజీ నగర్, యాదయ్య నగర్లోని కొన్ని లేన్లలో కొత్త నీటి పైప్లైన్లను ఏర్పాటు చేయాలంటూ అధికారులకు ఎమ్మెల్యేకు ప్రతిపాదన లెటర్ను అందజేసింది. నీటి సరఫరా విషయంలో సహకరిం చిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు ఏసిఎఫ్ ప్రత్యే క ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమం లో ఏసిఎఫ్ అధ్యక్షుడు వినయ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేందర్ బాబు, వినోద్, రవి, నరసింలు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.