11 March, 2026 | 4:14 PM

Breaking News

నిరుద్యోగుల కోసం ప్రత్యేక యాప్

04-11-2024 12:01 AM
  1. పట్టభద్రులందరూ సద్వినియోగం చేసుకోవాలి
  2. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి

కరీంనగర్, నవంబర్ 3 (విజయక్రాంతి): నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, పట్టభద్రులందరూ ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కరీంనగర్‌లోని గిద్దెపెరుమాండ్ల స్వామి ఆలయ మైదానంలో వాకర్స్‌తో, జిల్లా గ్రంథాలయంలో పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రానున్నదని, దానికనుగుణంగా మార్పులను చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.