11 March, 2026 | 2:34 PM

Breaking News

మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •  

పూటకో పార్టీ మార్చడం కడియం నైజం

04-11-2024 12:02 AM
  1. ఎన్‌టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌కు వెన్నుపోటు..
  2. మాజీ ఎమ్మెల్యే రాజయ్య

జనగామ, నవంబర్ 3 (విజయక్రాంతి): పూటకో పార్టీ మార్చడం కడియం శ్రీహరి నైజం అని, ఎన్‌టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనుడు కడి యం శ్రీహరి అని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. కడియం తన పదవికి రాజీనామా చేయకుంటే వీపు వాయిస్తామన్నారు.

ఆదివారం బీఆర్‌ఎస్ జనగామ జిల్లా కార్యాల యంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ జెండాపై గెలిచిన కడియం.. తన కూతురు రాజకీయ స్వలాభం కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్లారన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలను  మోసం చేసిన ఆయన.. ఘన్‌పూర్ కాంగ్రెస్‌లో సుధీర్ఘ కాలంగా ఉంటున్న సింగపురం ఇందిరను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్ ఆస్తులెంత అని అడుగుతున్న కడియంకు 1994కు ముందు ఎన్ని ఆస్తులున్నాయో చెప్పాలన్నారు. త్వరలోనే పార్టీ ఫిరాయించిన స్థానాల్లో ఉప ఎన్నికలు రానున్నాయని, ఆ ఎన్నికల్లో కడియం చిత్తుగా ఓడిపోవడం ఖాయమని రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సెవెల్లి సంపత్, ఉడుగుల భాగ్య, బస్వగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.