కన్న కొడుకు జ్ఞాపకంగా విగ్రహం ఏర్పాటు
మహబూబాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కన్న కొడుకు అకాల మరణాన్ని తట్టుకోలేకపోయిన కొడుకు రూపం ఎప్పటికీ కళ్ల ముందే ఉండాలనే భావనతో మరణించిన కన్న కొడుకు శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం బత్తులపల్లి గ్రామంలో బుధవారం జరిగింది.
గ్రామానికి చెందిన జాడి వేణుగోపాల్ కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ నేపథ్యంలో తండ్రి వెంకన్న కొడుకు మరణాన్ని తట్టుకోలేక పోయిన తండ్రి కనీసం అతని రూపాన్ని నిరంతరం కళ్ళముందే ఉండే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బుధవారం విగ్రహావిష్కరణ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వాహనాలను నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని, ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, తల్లిదండ్రులకు శోకాన్ని కలిగించకూడదని పేర్కొన్నారు.






