10 May, 2026 | 1:21 AM

ఆ విషయంలో పోరాటం తప్పడంలేదు!

10-05-2026 12:11 AM

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటీనటుల పారితోషికాల గురించి ఓపెన్‌గా మాట్లాడింది. సినిమా సెట్స్‌లో హీరోయిన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పారితోషికం విషయంలో జరిపే చర్చలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇండ స్ట్రీలోని అసమానతల గురించి కూడా ఆమె మాట్లాడింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా సహా అన్ని మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. “పారితోషికం విషయంలో ఇప్పటికీ  చాలా పోరాటం చేయా ల్సివ స్తోంది.

నిర్మాతలు ఎక్కడైనా ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటే.. ముందుగా హీరోయిన్ రెమ్యూనరేషన్‌నే తగ్గిస్తా రు. బడ్జెట్‌లో ఎక్కువ భాగం హీరోకే వెళ్తున్నప్పటికీ, తగ్గించే విషయంలో మాత్రం మా దగ్గరి నుంచే ప్రారంభిస్తారు. బాలీవుడ్ లో చాలా విషయాల్లో మార్పు రావాలి. సెట్‌లోకి హీరో రాకముందే హీరోయిన్ సిద్ధంగా ఉందా.. లేదా..? అని పదేపదే చెక్ చేస్తుంటారు. హీరో వేచి ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తారు. ఇవి చిన్న విషయాలుగా అనిపించినా, ఈ విష యంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది.

నా కెరీర్ మొదట్లో నాతోపాటు నటించిన ఓ హీరోకు నాకంటే మంచి కారు ఇచ్చారు. అతను నాకంటే సీనియర్ కూడా కాదు. నేను మాట్లాడుతోంది కారు గురిం చి కాదు.. సమాన మైన గౌరవం ఇవ్వడం లేదనేదే నా బాధ. అప్పట్లో ఇవన్నీ మాట్లాడాలంటే కష్టమయ్యేది. కానీ ఇప్పుడు నేను నాకోసం నిలబడుతున్నా. మహిళా ప్రాధాన్య చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశంతోనే నేను ప్రొడక్షన్ రం గంలో కి అడుగుపెట్టా. బాలీవుడ్‌లో మహిళల కోసం గొప్ప పాత్రలు రావడం త క్కువ, ఆ పరిస్థితిని మార్చడమే నా ల క్ష్యం” అని కృతి తెలిపారు.