కోలీవుడ్‌లోకి ఎంట్రీ!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శివాని నాగారం ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలి ప్రయత్నంలోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా హిట్ కావడంతో శివాని పేరు ఇండస్ట్రీలో మార్మోగింది. ఆ తర్వాత మౌళి సరసన నటించిన ‘లిటిల్ హార్ట్స్’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమెను లక్కీ హీరోయిన్‌గా పిలవడం ఆరంభించారు.
ఇదిలావుంటే, తాజాగా శివానికి సంబంధించి ఒక ఆసక్తికర వార్త ఫిలింనగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. శివాని నాగారం ఇప్పుడు కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు అభిషన్ జీవింత్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త ప్రాజెక్టులో శివాని హీరోయిన్‌గా ఎంపికైనట్టు సమాచారం. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంతో దర్శకుడిగా మారి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు అభిషన్ జీవింత్. ఆ తర్వాత ‘విత్ లవ్’ చిత్రం తో హీరోగా నూ మరో విజయాన్ని తన ఖాతా లో వేసుకున్నారు. ఇ ప్పుడు హీ రోగా రెం డో సినిమా కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు గౌతమ్ శివరామన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్టులోనే శివాని నాగారం ఒక కథానాయికగా ఎంపికైనట్టు టాక్ వినవస్తోంది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఫేమ్ యోగలక్ష్మి కూడా ఇందులో మరో కీలక పాత్రలో కనిపించనుందట. ఇటీవల ‘హే భగవాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివానికి ఆ సినిమా ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయిం ది. అంతకుముందు తెలుగులో రెండు హిట్లు అందుకున్న ఈ శి వాని ఇప్పుడు తమిళంలోనూ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది.






