13-11-2025 12:27:04 AM
ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి క్రైమ్, నవంబర్ 12 : విజయానికి కేవలం కలలు కాదు, క్రమబద్ధమైన సాధన కావాలి. రోజూ నిర్దిష్ట సమయపట్టికతో లెక్కల సాధన చేయడం, మాక్ టెస్ట్ ల ద్వారా తన బలహీనతలను గుర్తించడం మీ లక్ష్య సాధనానికి దారి చూపుతుందని కష్టపడి చదివే విద్యార్థి ఎప్పుడూ ఓడిపోడని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బండారు నగర్ కాలనిలోని ఆద్య కానిస్టేబుల్, ఎస్త్స్ర కోచింగ్ సెంటర్‌ను సందర్శించి విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. పోలీసు పరీక్షల్లో లెక్కల పట్టు, సమయపాలన, దృష్టి కేంద్రీకరణ అత్యంత కీలకమని విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ మీ ప్రయత్నం శ్రమతో, నిబద్ధతతో ఉంటే పోలీసు ఉద్యోగం ఖాయమన్నారు. అనంతరం కోచింగ్ సెంటర్లో గ్రాండ్ టెస్టులో ఉత్తమ మార్కుల సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఎస్పీ అభినందించారు. కోచింగ్ సెంటర్ యాజమాన్యం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.