calender_icon.png 13 November, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీసీఆర్బీ డీఎస్పీగా బాలాజీ నాయక్

13-11-2025 12:24:31 AM

వనపర్తి, క్రైమ్ నవంబర్ 12 : వనపర్తి జిల్లా డిసిఆర్బీ  డీఎస్పీగా బాలాజీ నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పోలీసు కార్యాలయం లో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వృత్తి ఒక సేవాధర్మం. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, సానుభూతితో పరిష్కరించడమే నిజమైన పోలీసు ధర్మం.

విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలనతో వ్యవహరిస్తే ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించవచ్చన్నారు. బాలాజీ నాయక్ గారు ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ ట్రాఫిక్ ఏసీపీగా విధులు నిర్వహించి వనపర్తి జిల్లాకు బదిలీపై వచ్చి బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.