calender_icon.png 13 November, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం

13-11-2025 12:28:23 AM

  1. అదే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం 
  2. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

గరిడేపల్లి, నవంబర్ 12 (విజయక్రాంతి): పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలంలో రూ.42.63  కోట్ల విలువగల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పలు పనులను ప్రారంభించారు. గడ్డిపల్లిలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు, గడ్డిపల్లి నుంచి పాఠశాల వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

పొనుగోడు నుంచి అప్పన్నపేట వర కు రోడ్డు పనులకు, మెయిన్ రోడ్డు నుంచి పాత బస్టాండ్ వరకు బీటీ రోడ్డు పనులకు, మల్లయ్య గూడెం నుంచి పాత నేరేడుచర్ల వరకు బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పొనుగోడు ఊర చెరువులో పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం అందించిన చేప పిల్లలను వదిలారు. గరిడేపల్లి నుంచి అలింగాపూర్ వరకు డబుల్ రోడ్డును ప్రారంభిం చారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరు అందించే అవకాశం కలగటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 150 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలో చరిత్ర సృష్టించింది అన్నారు. గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లిలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని మంత్రి ఉత్తమ్ మార్గమధ్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రైతులకు  ఇ బ్బం దులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కలెక్టర్ తేజస్, ఎస్పీ నరసింహ, ఆర్డీవో శ్రీనివాసులు, ఆర్ అండ్‌బీ ఈ ఈ సీతారామయ్య, నియోజకవర్గ నాయకులు అరుణ్ కుమార్ దేశముఖ్, సాముల శివారెడ్డి, జల్ది రవికుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు త్రిపురం అంజన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీలు పైడిమర్రి రంగనాథ్, పెండెం శ్రీనివా స్‌గౌడ్, బచ్చలకూరి మట్టయ్య ఉన్నారు.