చట్టాలపై అధ్యయనం అవసరం
23-06-2024 01:10 AM
న్యాయవాదులకు న్యాయమూర్తుల పిలుపు
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): వచ్చే నెల నుంచి అమలులోకి రానున్న మూడు నూతన క్రిమినల్ చట్టాలపై న్యాయవాదులు అధ్యయనం చేయాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీ సామ్ కోశి, జస్టిస్ సుజోయ్ పాల్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో శనివారం తెలంగాణ బార్ కౌన్సిల్, రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమి ఆధ్వర్యంలో కొత్త చట్టా లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. న్యాయవాదుల కు పాత, కొత్త క్రిమినల్ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాల్సిందేనన్నారు. రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ఎం. రాజేందర్ మాట్లాడుతూ... న్యాయవాదులకు కొత్త చట్టా లపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.






