19 June, 2026 | 2:24 AM

కొలంబియా అదిరిపోయే విజయం

19-06-2026 12:56 AM

మెక్సికో సిటీ, జూన్ 18: సాకర్ ప్రపంచకప్‌లోకి కొలంబియా గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది. తన తొలి మ్యాచ్‌లో ఉజ్బెకిస్థాన్‌పై 3 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 8 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్‌లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. ఆ జట్టు లూయిస్ డియాజ్ అదరగొట్టాడు. ఫస్టాఫ్‌లో డేనియల్ మునోజ్ చేసిన గోల్‌తో కొలంబి యా ఖాతా తెరిచింది. ఉజ్బెకిస్థాన్ ఒక్క గోల్ చేయలేకపోయింది.

దీంతో ఫస్టాఫ్ 1 ముగిసింది. రెండో అర్ధభాగంలో ఉజ్బెకిస్థాన్ ఆటగాడు ఉగ్లీ ఫైజుల్లావ్ 60వ నిమిషంలో అద్భుతమైన గోల్‌తో స్కోర్లు సమం అయ్యా యి. ఇది ఉజ్బెకిస్థాన్ జట్టుకు ఫిఫాలో తొలి గోల్. అయితే ఆ తర్వాత ఐదు నిమిషాల్లోనే డియాజ్ గోల్ సాధించడంతో మళ్లీ కొలంబియా ఆధిక్యంలోకి వెళ్లింది. వెనుకబడినా ఉజ్బెకిస్థాన్ పట్టు వదలకుండా పోరాడింది. ఇక ఇంజ్యూరీ టైమ్ చివరి నిమిషాల్లో, కాంపాజ్‌కు క్రాస్ చేయగా అతను హెడర్‌తో గోల్‌లో కి పంపించాడు.