calender_icon.png 2 December, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ద్రౌపది’ నెలరాజే..

02-12-2025 10:47:32 PM

నేతాజీ ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న చిత్రం ‘ద్రౌపది2’. మోహన్ జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్. ద్రౌపది పాత్రలోని రక్షణ చంద్రచూడన్ ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ‘నెలరాజె..’ అనే పాటను రిలీజ్ చేశారు. అమ్మాయి కాబోయే వరుడిని మనసులో ఊహించుకుంటూ పాడే పాట ఇది. జిబ్రాన్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ సినిమాలోని ఈ పాటను సామ్రాట్ రాయగా పద్మలత పాడారు. ఈ సినిమాకు పిలిప్ ఆర్ సుందర్ కెమెరామెన్‌గా, దేవరాజ్ ఎస్ ఎడిటర్‌గా, ఎస్‌కే ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.