3 July, 2026 | 4:56 PM

Breaking News

కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •   హరీశ్ రావు ఫోన్ చేస్తే.. లిఫ్ట్ చేయలేని పిరికి వాళ్లం కాదు   •   మండల వ్యాప్తంగా కురిసిన వర్షం... రైతుల్లో ఆనందం   •  

గోల్డెన్‌డేస్‌ను గుర్తుచేసే దూరదర్శని

28-12-2024 12:00 AM

సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దూరదర్శని’.  ‘కలిపింది ఇద్దరిని’ అనేది ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై బీ సాయి ప్రతాప్‌రెడ్డి, జయశంకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకొంటోంది. 90వ దశకం నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్‌పీ పట్నాయక్ మాట్లాడు తూ.. ‘ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది’ అన్నారు. హీరో సువిక్షిత్ మాట్లాడుతూ ‘బ్యాక్‌డ్రాప్‌కు తగ్గ నటీనటులు, లోకేషన్స్‌తో సహజంగా తెరకెక్కించిన సినిమా’ అన్నారు.

“దూరదర్శని’ వాణి, హరిలను ఎలా కలిపిందనేది ఆసక్తికరం గా ఉంటుంది’ అని హీరోయిన్ గీతిక చెప్పారు. జెమిని సురేశ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా అందరిని మళ్లీ చిన్ననాటి గోల్డెన్‌డేస్‌కు తీసుకెళ్తుంది. చాలా రోజుల తర్వాత నాకు ఈ చిత్రంలో మంచి పాత్ర దొరికింది’ అన్నారు. దర్శకుడు కార్తియక, తిరుపతిరెడ్డి, నారాయణ, సునీల్ పొన్నం, బాలారాజు, తేజ, పాండు, సతీశ్ పాల్గొన్నారు.