3 July, 2026 | 5:59 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

అల్లు అర్జున్ కేసు విచారణ వాయిదా

27-12-2024 12:55 PM

హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో శుక్రవారం నాంపల్లి కోర్టు ముందు వర్చువల్‌గా హాజరయ్యారు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్(Allu Arjun bail petition)పై విచారణను నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. తదుపరి విచారణను నాంపల్లి కోర్టు(Nampally Court) ఈనెల 30కి వాయిదా వేసింది. సంధ్య థియేటర్లలో పుష్ప-2(Pushpa 2: The Rule) ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టయ్యాడు. డిసెంబర్ 13న నాంపల్లి కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని మంజూరు చేసింది. అయితే, హైదరాబాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, లాడ్ చేసిన కొద్ది గంటల్లోనే అర్జున్ తెలంగాణ హైకోర్టు(Telangana High Court) నుండి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పొందారు.