3 July, 2026 | 4:19 PM

హరీశ్ రావు ఫోన్ చేస్తే.. లిఫ్ట్ చేయలేని పిరికి వాళ్లం కాదు

03-07-2026 03:43 PM

హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) స్పందించారు. గ్లోబల్ టెండర్ వేస్తే మఫల్ లాల్ కు వస్తే మేమేం చేస్తాం? మఫల్ లాల్ మాకు చుట్టమా? పరిచయమా?, హరీశ్ రావు ఫోన్ చేసినప్పుడు మీటింగ్ లో ఉన్నాం.. ఎలా ఎత్తాలి? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేని పిరికి వాళ్లం కాదని మంత్రి పొన్న స్పష్టం చేశారు. 

నిన్న గన్ పార్క్ వద్ద గోషామహల్, మలక్ పేట లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉందని చెప్పి వెళ్ళామని పేర్కొన్నారు. హరీష్ రావు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్తున్నారు.. టెలిఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటున్నారు... మీడియా నుండి గన్ పార్క్ వద్ద జర్నలిస్ట్ రాహుల్ ఫోన్ చేశారు. ఆయన లిఫ్ట్ చేసాడా? అని ప్రశ్నించారు. పోలీసులతో అరెస్ట్ చేసేంత పిరికి కాదు.. తమకు క్రెడిబిలిటీ ఉందని వెల్లడించారు.

అధికారంలో ఉన్న ప్రతిపక్షంగా వ్యతిరేకించామన్నారు. పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లక్ష్మణ్ కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తులం మీకు తెలియదా అన్నారు. 10 సంవత్సరాలుగా మీతో లాభపడ్డ చెంచా గాళ్ళు వచ్చి చెప్తే మీరు ఏది పడితే అది మాట్లాడితే ఎట్లాఅని ప్రశ్నించారు. మొత్తం టెండర్లు 1142 కోట్లు అయితే 2 వేల కోట్లు స్కాం ఎలా జరుగుతుందన్న పొన్నం అన్ని విధాలుగా బాగుండాలని గురుకులాల సెంట్రాలైజ్ చేయాలని చేశామని తెలిపారు.