15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అర్హులకు మొండి 'చెయ్యి'

29-04-2025 06:34 PM

ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి..

జడ్పీసీఈఓ కు వావిళ్ల రమేష్ గౌడ్ ఫిర్యాధు..

పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కమిటీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, సంపన్న కుటుంబాలను అర్హులుగా గుర్తించి ఎంపీడీఓకు జాబితా పంపుతున్నట్లు ఆ జాబితానే తుది జాబితాగా గుర్తిస్తున్నట్లు వెంటనే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితాను పునః పరిశీలన చేసి అక్రమ వసూలు.. అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ జిల్లా పరిషత్ సీఈఓ వీవీ అప్పారావుకు మంగళవారం పీఏసీఎస్ వైస్ చైర్మన్ వావిళ్ల రమేష్ గౌడ్ మండల యువతతో కలసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు సైతం పాలక వర్గాలకు అనుకూలంగా మారి వారు పంపిన పేర్లను జాబితాలో పొందపర్చడంతో నిజమైన అర్హులకు ఇందిరమ్మ గూడు దూరమవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు కాకుండా భూస్వాములకు, సంపన్న వర్గాలకు కట్టబెడుతున్నారని అన్నారు. ఇందిరమ్మ కమిటీలకు అధికారులు వత్తాసు పలకడం హేయమైన చర్యన్నారు. అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై రిసర్వే చేసి సంపన్నలను, అనర్హులను జాబితానుంచి తొలగించి నిజమైన అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు అందేలా, చూడాలని కోరారు. లేని ఎడల గ్రామాలలో పేదలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి హక్కులు సాధించేంత వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. వారి వెంట గంగారపు శ్రీనివాస్, భూక్యా అశోక్, చంటి నాయక్, భూక్యా వెంకటేశ్వర్లు ఉన్నారు.