6 July, 2026 | 9:13 PM

Breaking News

ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •   రేబిస్ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం   •  

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి

29-04-2025 06:31 PM

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం చిన్న ఎక్లారా జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు(MLA Thota Lakshmi Kantha Rao) ఆదేశాల మేరకు గ్రామంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగళవారం కాంగ్రెస్ నాయకులు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ పటేల్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా ఉంటుందన్నారు. సీఎంఆర్ఎఫ్ పథకం చికిత్స పొందిన పేదలకు ఆర్థిక భరోసా అన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్, కాశీనాథ్, రవి పటేల్, మనోహర్, దేవానంద్, రమేశ్, తదితరులు ఉన్నారు.