3 July, 2026 | 6:21 PM

Breaking News

అంగన్వాడి పిల్లలకు యూనిఫార్మ్స్ పంపిణీ   •   టీపీసీసీ ప్రధాన కార్యదర్శిని పరామర్శించిన యువనేత ఇలియాస్   •   జిల్లాలో నిరుపేదలకు మున్నూరు కాపు సంఘం అండగా ఉంటుంది   •   కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •  

లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచారణ జరిపించాలి

10-06-2025 12:00 AM

చిగురుమామిడి, జూన్  9 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక, రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఐ డిమాండ్ చేసింది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగలేదని అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై అనర్హులను ఎంపిక చేయడం జరిగిందని ఆరోపిస్తూ సీపీఐ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించి, నాయకులు సోమవారం ధర్నా చేపట్టారు. 

ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ చాలా గ్రామాల్లో అర్హులైన నిరుపేదలకు ఇల్లు మంజూరు కాలేదని, కాంగ్రెస్ నాయకులు ఎంపీడీవోతో కలిసి అనర్హులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, జిల్లా కార్యవర్గ సభ్యులు అందే స్వామి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, రైతు సంఘం మండల అధ్యక్షులు గోలి బాపురెడ్డి, నాయకులు జిల్లా నాయకులు యుగంధర్, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, అందే చిన్నస్వామి,మండల నాయకులు బండారీ తిరుపతి, పైడిపల్లి వెంకటేష్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.