అంగన్వాడి పిల్లలకు యూనిఫార్మ్స్ పంపిణీ
03-07-2026 06:21 PM
కొమురవెల్లి,(విజయక్రాంతి): కొమురవెల్లి మండల కేంద్రంలోని నాలుగో అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ టీచర్ కడెం రేణుక ఆధ్వర్యంలో సర్పంచ్ గొల్లపల్లి పద్మ ఆంజనేయులు పిల్లలకు యూనిఫామ్ అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ పద్మ ఆంజనేయులు మాట్లాడుతూ ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లలకు అనుబంధ పౌష్టికారము కచ్చితంగా తినిపించాలని, దానివల్ల పిల్లలు శారీరక బరువు తో పాటు ఎత్తు పెరుగుతాలన్నారు. మూడు సంవత్సరాలు నిండగానే పిల్లలను అంగన్వాడి కేంద్రాలకు పంపిస్తే, ఆటపాటల ద్వారా వారు చురుగ్గా తయారవుతారన్నారు. అంగన్వాడి టీచర్ కడెం రేణుక మాట్లాడుతూ పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడి కేంద్రాలకు పంపిస్తే అన్ని చక్కగా నేర్చుకొని చురుకుగా తయారవుతారు అన్నారు.






