14 April, 2026 | 1:35 PM

భూసేకరణ పునరావాస పునరుపాధి కల్పనపై సమీక్షా సమావేశం

10-06-2025 12:00 AM

నారాయణపేట.జూన్ 9(విజయక్రాంతి ) : నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో సోమవారం  సాయంత్రం  భూ సేకరణ పునరావాస పునరుపాది కల్పన పై  జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమక్షంలో స మీక్షా సమావేశం నిర్వహించారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సం బంధించి రెవెన్యూ అధికారులు ఇటీవలే ని ర్వహించిన గ్రామ సభలు, భూసేకరణ సర్వే పై  వచ్చిన నోటిఫికేషన్ల పై చర్చించారు.

స మావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ మాట్లాడుతూ.. భూసేకరణలో పునరావాసం మరియు పునరుపాది‘ (R&R) అనేది భూసేకరణ ప్రాజెక్టుల ద్వారా నిర్వాసితులైన వ్యక్తులు లేదా కుటుంబాలకు మద్దతు అందించే ప్రక్రియను సూచిస్తుందని తెలిపారు.

ఇందులో న్యాయమైన పరిహారా న్ని నిర్ధారించడం వారి పునరావాసం కోసం తగిన సౌకర్యాలను అందించడం, తరచుగా సేకరణ తర్వాత వారి సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకోవడం వంటివి ఉంటాయన్నారు. భూ సేకరణ చేసినప్పుడు పట్టాదారులు తమ భూములు కో ల్పోతే ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు.

కానీ భూ సేకర ణలో మొత్తం భూమితో పాటు  జీవనోపాధిని కోల్పోయిన వారికి ఆర్ అండ్ అర్ చ ట్టం వర్తిస్తుందని తెలిపారు. వచ్చిన 13 నోటిఫికేషన్ల లో 12 మంది కి ఆర్ అండ్ అర్ చ ట్టం వర్తిస్తుందని అదనపు కలెక్టర్ పునరావా స పునరుపాది కమిటీ సభ్యులకు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రామచంద్రనాయ క్, సెక్షన్ అధికారి శ్రీధర్ సభ్యులు సతీష్ కు మార్, పడాకుల శ్రీనివాసులు, నారాయణపేట,మక్తల్, తహాసిల్దారులు పాల్గొన్నారు.