20-12-2025 12:46:17 AM
ఆయిజ, డిసెంబర్ 19: గద్వాల జిల్లా ఆయిజ మండలంలోని బింగిదొడ్డి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంను తగులబెట్టారు. భాధితుడు తెలిపిన వివరాల ప్రకారంగా బింగిదొడ్డి గ్రామంలోని కుమ్మరి నడిపెన్న తనపోలంలో కంది పంటను కోసిన కoదుల కల్లంకై రాత్రి అక్కడే పొలం దగ్గర నిద్రించాడు.
గురువారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అక్కడే ఉన్న తన ద్విచక్ర వాహనం హెచ్ ఎఫ్ డిలాక్స్ మోటార్ సైకిల్ ను తగలబెట్టి వెళ్లారు. నడిపెన్న నిద్రనుండి లేచేసరికి వాహనం పూర్తిగా దగ్దమైనదని ఎవరో ఉద్దేశ్యపూర్వకంగానే బైక్ ను తగులబెట్టి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని కుమ్మరి నడిపెన్న అనుమానిస్తున్నారు.