calender_icon.png 20 December, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ గిరిజన విద్యార్థి రేవన్ ప్రతిభ

20-12-2025 12:44:50 AM

చారకొండ, డిసెంబర్ 19: గ్రూప్ 3లో గిరిజన యువకుడు సబావత్ రేవన్ సత్తా చాటి క్రీడా శాఖలో జూనియర్ అనిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. మండలంలోని మర్రిపల్లి గ్రామ పంచాయతీ బోడబండ తండాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సబావత్ దేవీలాల్ చౌహాన్, చారకొండ మాజీ సర్పంచి శిల్పాదేవిలాల్ కుమారుడైన రేవన్ జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశాడు.

మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 3 లో 2,203 ర్యాంక్ సాధించి జూనియర్ అనిస్టెంట్ కు ఎంపికయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో మండల వివిధ పార్టీల నాయకులు, గిరిజన సంఘాల నాయకులు తదితరులు రేవన్ ను అభినందించారు.