20-12-2025 12:46:39 AM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ,డిసెంబర్ 19,(విజయ క్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను శుక్రవారం కలిసి ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటేషన్, ట్రాన్స్ఫ్ప ఇతర శాఖలకు వెళ్లిన ఉద్యోగులను తిరిగి మాతృ దేవస్థానానికి నియమించాల్సిన అవసరం ఉందని, అలాగే ఉద్యోగుల పెన్షన్ డిపాజిట్లను ప్రభుత్వం ద్వారా పెంచే విధంగా చర్యలు చేపట్టాలని యూనియన్ కోరింది.
దేవస్థానం అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్న తరుణంలో, అనుభవం కలిగిన ఉద్యోగుల సేవలు దేవస్థానానికి అత్యంత అవసరమని యూనియన్ నేతలు వివరించారు. ఈ అంశాలపై స్పందించిన విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ భేటీలో దేవస్థానం ఉద్యోగుల యూనియన్ సభ్యులు, ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు.