21 July, 2026 | 12:18 PM

ఇటీవలి ప్రేమకథల్లో విభిన్న లవ్‌స్టోరీ

21-07-2026 01:20 AM

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయిరాజేశ్ నిర్మిస్తున్నారు. సాయిరాజేశ్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. సిరి హన్మంతు, మహేందర్, నరేశ్, పూజ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 24న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అంతకు ఒకరోజు ముందే.. అంటే, ఈ నెల 23న ఈ మూవీ ప్రీమియర్స్ వేయనున్నారు.

ఇదిలావుంటే, తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికేషన్ దక్కింది. ఇటీవల వచ్చిన ప్రేమకథల్లో ఈ సినిమా విభిన్నంగా ఉందని కుటుంబం అంతా చూడగలిగే ఇలాంటి మంచి ప్రేమకథలు మరిన్ని రావాలని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. ఈ చిత్రానికి డీవోపీ: విశ్వాస్ డేనియల్; సంగీతం: మణిశర్మ; సాహిత్యం: అనంత్ శ్రీరామ్; ఆర్ట్: భాస్కర్ ముదావత్; ఎడిటర్: సంతోష్ నాయుడు.