21 July, 2026 | 4:57 PM

విపక్ష సభ్యుల నినాదాలు.. ఉభయసభలు వాయిదా

21-07-2026 11:27 AM

న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల నినాదాల మధ్య పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్, అవకతవకలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. జంతర్ మంతర్ వద్ద నిరసన కారులపై దాడిని విపక్షాలు ఖండించాయి. NEET పేపర్ లీక్, లాఠీఛార్జ్ గురించి మాట్లాడేందుకు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేమరోసారి ప్రయత్నించగా, రాజ్యసభ చైర్మన్ సభను మధ్యాహ్నం 12:00 గంటల వరకు వాయిదా వేశారు.