21 July, 2026 | 5:11 PM

మొక్కలు నాటేందుకు వేళాయె

21-07-2026 11:17 AM

ఇతర జిల్లాల నర్సరీల నుండి మొక్కల సరఫరా.

బోథ్, జులై 21 (విజయక్రాంతి): ప్రతి ఏటా అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే స్థానికంగా ఉన్న నర్సరీలలో మొక్కలు పెరగకపోవడంతో ఇతర జిల్లాల నుండి మొక్కలను తెప్పించి అటవీ శాఖ సిబ్బంది నాటేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి లక్షల రూపాయలు నిధులు వెచ్చించి వేల సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం గత ఏడాది నాటిన మొక్కలు చనిపోయిన స్థానాలలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. దీంతో అధికారులు మొక్కలను నాటి బ్రతికించాలన్న ఉద్దేశంతో చర్యలు చేపట్టారు. రెండు రోజుల నుండి వర్షాలు కురుస్తుండడంతో మొక్కలు నాటే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.