14 April, 2026 | 2:01 PM

సిరిసిల్ల రాజయ్యకు ఘన స్వాగతం

01-06-2025 11:14 PM

నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య సిరిసిల్ల(Telangana State Finance Commission Chairman Rajaiah Siricilla)ని ఆదివారం నిర్మల్ లో ఘన స్వాగతం పలికారు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సైద్ అర్జుమాంద్ అలీ నిర్మల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమారెడ్డి, భైన్సా మార్కెట్ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ పట్టణ అధ్యక్షుడు నాందేడప్పు చిన్ను,రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి అజార్ హుస్సేన్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు జునైద్ మెమన్, నిర్మల్ పట్టణ మైనార్టీ అధ్యక్షులు మతిన్, మాజీ జడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మాజీ కౌసులర్లు ఇమ్రాన్ ఉల్లాహ్, ప్రదీప్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు సైద్ అర్షద్, కుంతం గణేష్ ఆకుల హరీష్, మొయిన్, తదితరులు స్వాగతం పలుకడం జరిగింది.