8 March, 2026 | 5:05 AM

మూఢనమ్మకాలు ఓ గర్భవతి ప్రాణం తీసింది..

01-06-2025 11:24 PM

అబార్షన్ మాత్రలు మింగించడంతో గర్భవతి మృతి..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): మూఢనమ్మకంతో వ్యవహరించిన తీరు ఓ నిండు చులాలు ప్రాణం తీసింది. బలవంతంగా అబార్షన్ మాత్రలు మింగించడంతో గర్భవతి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదిలాబాద్(Adilabad)లోని బంగారి గూడ వాసి ప్రశాంత్ కొత్తగా ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. ఐతే అతడి భార్య ప్రవల్లిక 6 నెలల గర్భవతి. దీంతో ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ఇంట్లో ఎవరైన గర్భం దలిస్తే ఇది శుభపరిణామం కాదని కొందరు పేర్కొనడంతో శుక్రవారం గర్భవతి ప్రవల్లికకు ఆమె భర్త బలవంతంగా అబార్షన్ మాత్రలు మింగించడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, భర్త ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు.