బీజేపీ స్టేట్ చీఫ్‌కు ఘన స్వాగతం
03-09-2025 12:00 AM
అబ్దుల్లాపూర్‌మెట్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు యన్. రామచందర్‌రావు నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సంపూర్ణ హోటల్ వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు బోసుపల్లి ప్రతాప్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు బచ్చిగళ్ల రమేశ్, పరంగి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.






