5 August, 2026 | 8:06 PM

అర్హులందరికీ సంక్షేమ పథకాలే లక్ష్యం

05-08-2026 07:29 PM

- మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి

- 56 మంది డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ

గజ్వేల్: కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తోందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. బుధవారం కొడకండ్లలో 56 మంది డబుల్ బెడ్‌రూమ్ లబ్ధిదారులకు పొజిషన్ ప్రొసీడింగ్ పత్రాలు, కంటి వైద్య శిబిరంలో గుర్తించిన రోగులకు కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు.

రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, రైతులు ఎరువులను పారదర్శకంగా పొందేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.