17 June, 2026 | 1:46 PM

ట్రాన్స్ ఫార్మర్ తీగ తగిలి యువ రైతుకు తీవ్ర గాయాలు

20-10-2024 12:40 PM

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ సపోర్ట్ తీగ తగలడంతో యువ రైతు షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం ఉదయం గ్రామానికి చెందిన కుక్కల సాగర్ అతని పొలం వద్దకు వ్యవసాయ పనుల కోసం పనిచేసేందుకు పొలం ఒడ్డు మీద నుంచి నడుచుకుంటూ పోతుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ ఫార్మర్ సపోర్ట్ తీగకు తగలడంతో సాగర్ షాక్ కు గురైయ్యాడు. తీవ్ర గాయాలైన సాగర్ ను గమనించిన అక్కడే ఉన్న రైతులు వెంటనే కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.