17 June, 2026 | 12:19 PM

Breaking News

కేజీబీవీ తిమ్మాజిపేట స్పెషల్ ఆఫీసర్ పై బదిలీ వేటు.!   •   అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్   •   ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •  

తోటమాలిగా మారిన ఎమ్మెల్యే

20-10-2024 12:45 PM

కాలక్షేపంగా చేనులో పనిచేసిన కోవలక్ష్మి 

కుమ్రంభీం, ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి తన చేనులో తోటమాలిగా మారింది. చేనులో పెంచుతున్న జామ, మామిడి, వంకాయ, టమాట, బబ్బర్లు తదితర మొక్కలను స్వయంగా పరిశీలించారు. కూరగాయలను కోసి ఇంటికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తన సొంత పనులు చేసుకోవడంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి ఏ రోజు కూడా వెనుకడుగు వేయదు. ఇంట్లోనూ తన పనులు తను చేసుకోవడం ఆసక్తి చూపుతుంది. సాదా సీదాగా వ్యవహరించే కోవలక్ష్మి పట్ల ప్రజలు ఎంతో సానుకూలత చూపుతారు.