17 June, 2026 | 1:35 PM

అంధకారంలో ఆరోగ్య ఉపకేంద్రం

17-06-2026 12:24 PM

ఫ్యాన్ లేక ఆరుబయట వేచి ఉన్న బాలింతలు

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం(Samsthan Narayanapur) మండలకేంద్రంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో కనీస సౌకర్యాలు లేక సిబ్బంది రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బకాయిలు చెల్లించలేదని విద్యుత్ శాఖ అధికారులు(Electricity Department Officials) కరెంట్ కట్ చేయడంతో అంధకారంలోనే చికిత్స చేయాల్సి వస్తుందని సిబ్బంది వాపోతున్నారు.

కనీసం ఫ్యాన్ కూడా లేకపోవడంతో బాలింతలు పసిపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆరుబయట వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రాథమిక ఆరోగ్యకేంద్రం దూరంగా ఉండడంతో ప్రజలకు ముఖ్యంగా గర్భిణీలకు,బాలింతలకు  వైద్యం అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉపకేంద్రం లో కనీస వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు  విన్నవించినా తమ సమస్యను పరిష్కరించలేదని ప్రభుత్వాలు మారినా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోగ్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.