23 June, 2026 | 5:07 PM

Breaking News

పాతబస్తీలో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •   నిర్మల్ నుండి ధర్మపురికి బస్సు   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి   •   డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులు   •   ఆడబిడ్డ పెండ్లికి ఐదువేల ఆర్థిక సహాయం   •   హజ్-2027 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం   •   సుల్తానాబాద్ లో ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి   •  

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

17-10-2024 02:27 AM

అంత్యక్రియల్లో పాడె మోసిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల (వనపర్తి), అక్టోబర్ 16 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున గద్వాల మండలం దయ్యాల వాగు సమీపంలోని గద్వాల జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ గద్వాల జిల్లా నాయకుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు పటేల్ రాంచంద్రా రెడ్డి(28) బుధవారం తెల్లవారుజామున ఎర్రవల్లి చౌరస్తా నుంచి గద్వాలకు కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి బ్రిడ్జి వాల్‌ను ఢీకొనడంతో రాం చంద్రారెడ్డి మృతి చెందాడు. అంత్యక్రియల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి పాడె మోశారు.