23 June, 2026 | 4:01 PM

నిరుద్యోగ సమస్యలపై పోరాడుతా

17-10-2024 02:26 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి

మిస్డ్‌కాల్ క్యాంపెయిన్ ప్రారంభం

కరీంనగర్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నిరుద్యోగ సమస్యలపై పోరాడుతానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మెట్‌పల్లి పట్టణంలో పర్యటించి ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులను కలిసి తనకు మద్దతు పలకాలని కోరారు.

తనను గెలిపిస్తే ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలపై మండలిలో గళమెత్తుతానని అన్నారు. కాగా పట్టభద్రుల ఓటరు నమోదు సులభతరం చేసేందుకు మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ద్వారా ఒక మొబైల్ నంబర్‌ను ఏర్పాటు చేశామని నరేందర్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లోని అల్ఫోర్స్ మెయిన్ క్యాంపస్‌లో మిస్డ్‌కాల్ క్యాంపెయిన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 9240021444 నంబర్‌కు మిస్డ్‌కాల్ చేస్తే తమ సిబ్బంది అందుబాటులోకి వచ్చి ఓటు నమోదుకు సహకరిస్తారని తెలిపారు.