18 May, 2026 | 3:06 AM

మద్యం మత్తులో ఓ యువకుడిపై దాడి

15-10-2024 12:37 PM

దారుణంగా కొట్టిన యువకులు

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కేంద్రంలో నల్ల పోచమ్మ ఆలయం గల్లీలో యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో ఓ యువకుడిని విచక్షణారహితంగా కొట్టారు. స్థానికులు ఆపేందుకు ప్రయత్నించినా మద్యం మత్తులో ఉన్న యువకులు వినిపించుకోలేదు. స్థానికులు యువకులను అదుపు చేసి గాయపడిన యువకుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,  పోలీసులకు ఫిర్యాదు చేశారు. సృహతప్పిన యువకుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు తెలిపారు.