23 April, 2026 | 7:03 PM

విద్యార్థుల దుర్మరణం బాధాకరం

30-07-2024 12:00 AM

ఢిల్లీలోని రావ్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో బేస్‌మెంట్‌లోకి భారీ వరద నీరు చేరిన కారణంగా ముగ్గురు మృత్యువాత పడడం అత్యంత బాధాకరం. పార్కింగ్, స్టోర్‌రూమ్ ఉండాల్సిన చోట గ్రంథాలయం వుండడం పెద్ద తప్పిదం. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే సెంటర్లను అధికారులు తనిఖీలు చేసి, లోపాలను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి.

 కామిడి సతీష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా