ఇసుక అక్రమ రవాణా కాకుండా చర్యలు
16-06-2026 05:08 PM
కుబీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కాకుండా ఇసుక రీసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ భావే ష్ మిశ్రా రెవిన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కుంటాల లోకేశ్వరం సరిహద్దులో ఉన్న మోత్కపల్లి ఇసుక రీచ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక ఎంతగానో ఉపయోగపడుతుందని దాన్ని అక్రమంగా రవాణా చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సూర్యారావు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.






