16 March, 2026 | 9:40 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

01-08-2024 01:13 AM

రాష్ట్రంలో నాలుగైదు రోజులు వర్షాలు

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో నాలుగైదు రోజు ల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల ఉరుము లు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అగస్టు 3న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచి ర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి, 5న రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు. బుధవారం వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, జగిత్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు  వర్షం కురవగా, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, వరంగల్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.